: ఇక మరింత చక్కగా వినిపిస్తుంది


చెవిటి వారికి ఇకనుండి మరింత చక్కగా వినిపించనుంది. చెవిటి వారికి మరింత ఎక్కువగా వినిపించేలా ఉండే ఒక సరికొత్త వినికిడి యంత్రాన్ని పరిశోధకులు తయారుచేశారు. ఇది ఎంత చిన్న శబ్ధాన్నైనా వారికి వినిపించేలా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడున్న యంత్రాలకన్నా కూడా ఇది కాస్త చిన్న సైజులో ఉన్నా ఎక్కువ వినికిడి శక్తిని కలిగివుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

కోక్లియర్‌ ఇంప్లాంట్స్‌ సంస్థ తయారుచేసిన ఈ వినికిడి యంత్రం బధిరులకు మరింత అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ప్రస్తుతమున్న వినికిడి యంత్రాలకన్నా కూడా ఇది 23 శాతం చిన్న సైజులో ఉంటుంది. న్యూక్ల్యెస్‌-6 అనే ఈ వినికిడి పరికరం వినలేనివారికి ఎంతగానో ఉపకరిస్తుందని దీన్ని ఆవిష్కరించిన వైద్యులు చెబుతున్నారు. అతి సూక్ష్మమైన శబ్దాలను సైతం ఇది గ్రహించే శక్తిని కలిగివుందని ఈఎన్ టీ అపోలో నిపుణులు డాక్టర్‌ రాంబాబు తెలిపారు. అపోలో ఆసుపత్రికి చెందిన ఛీఫ్‌ ఆడియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ పరికరం వాటర్‌ప్రూఫ్‌ పరికరమని, వర్షంలో తడిసినా కూడా ఇది ఏమీ కాదని అన్నారు.

  • Loading...

More Telugu News