: అవిశ్వాసమే కాదు.. దేన్నైనా ఎదుర్కొంటాం: బొత్స


బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్షాలు  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయంలో కసరత్తులు చేస్తుండగా.. దేన్నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం వ్యతిరేకించాలని తాము వైఎస్సార్సీపీని ఆహ్వానించలేదని బొత్స తెలిపారు.

ఆ పార్టీ వైఖరి ఏమిటో ఉప ప్రణాళిక బిల్లు సమయంలోనే స్పష్టమైందని బొత్స అన్నారు. ఆ సమయంలో వారు అయోమయానికి లోనయ్యారని ఆయన వివరించారు. ఇక పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తున్నవారిపై చర్యలు తీసుకునే అంశం పరిశీలనలో ఉందని బొత్స వెల్లడించారు. 

  • Loading...

More Telugu News