: ఒక ఇంటిఖర్చు నెలకు 12,940.. మరి ఆదాయం పెరిగిందా?: చంద్రబాబు
'ఒక ఇంటికి నెలకు 30 లీటర్ల పాలు కావాలి. మూడు పూటలు తినాలంటే 30 కేజీల బియ్యం కావాలి. పప్పు నెలకు నాలుగు కేజీలు అవసరమౌతుంది. 2 కేజీల వంట నూనె, చింతపండు కేజీ, ఉల్లిపాయలు 6 కేజీలు, సబ్బులు షాంపులు, అద్దె, కరెంటు బిల్లు, విద్య అన్నీ కలిపి నెలకు అయ్యే ఖర్చు 12,940 రూపాయలు. అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ, నేటికీ నాలుగు రెట్ల ఖర్చు పెరిగింది. మరి ఆదాయం పెరిగిందా?' అని బాబు సూటిగా ప్రశ్నించారు.
తాను వ్యక్తిగతంగా సర్వే చేయించానని, ప్రతి కుటుంబానికీ 50 వేల నుంచి లక్ష రూపాయల అప్పుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా నిత్యావసర వస్తువుల్ని రైతు బజార్లతో అందజేశామని ఆయన గుర్తు చేశారు.
ధర పెరిగితే దానిపై శ్రద్ధ పెట్టి తగ్గించిన ఘనత టీడీపీదేనని, తాము అధికారంలో ఉండగా 35 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇప్పించామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆధార్ కు సంబంధం లేకుండా ఇంటింటికీ గ్యాస్ పంపించే ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.