: డ్రింకివ్వలేదని పైలట్ తో గొడవకు దిగి... గోళ్లతో రక్కేసిన ఎన్నారై
ఇచ్చిన డ్రింక్ సరిపోక పైలట్ తో గొడవకు దిగి, క్రిస్ మస్ పండుగను జైళ్లో గడిపిందొక ఎన్నారై మహిళ. లాస్ ఏంజెలెస్-ఫోర్ట్ లాడర్ డెల్ ఫ్లోరిడా విమానంలో త్రిషా సేన్ అనే భారతీయ అమెరికన్ మహిళకు విమాన సిబ్బంది డ్రింక్ ఇచ్చారు. పండగ సరదాలో ఉన్న త్రిషా సేన్ తాను విమానంలోనే పని చేస్తున్నానని, తనకు మరో డ్రింక్ అదనంగా ఇవ్వాలని కోరింది. ఆమె కోరికను విమాన సిబ్బంది తిరస్కరించడంతో వారితో వాగ్వాదానికి దిగింది.
దీంతో పైలట్ కల్పించుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించడంతో అతడిని గోళ్లతో రక్కింది. దీనిని ఓ ప్రయాణీకుడు ఫోన్ లో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టాడు. దీంతో త్రిషా సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని క్రిస్ మస్ రోజున కోర్టులో ప్రవేశపెట్టారు.