: సర్ ఛార్జీ వసూలుపై ఈనెల 18న బహిరంగ విచారణ
విద్యుత్ సమస్యలపై నిరసన ధ్వనులు పెరిగిపోతున్న నేపథ్యంలో సర్ ఛార్జీ వసూలుపై ఈ నెల 18 న బహిరంగ విచారణ నిర్వహించాలని ఈఆర్ సీ నిర్ణయించింది. 2012-13 సీజన్ లో మూడో త్రైమాసికంలో రూ. 1068 కోట్ల సర్ ఛార్జీ వసూలు చేయాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. అయితే, ప్రజల నుంచి సర్ ఛార్జీ వసూలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బహిరంగ విచారణకు ఈఆర్ సీ షెడ్యూల్ విడుదల చేసింది.