: ముషారఫ్ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు. ఇస్లామాబాద్ లోని ఆయన నివాసం వద్ద 2.5 కిలోల బరువున్న పేలుడు పదార్థాలు, రెండు డిటొనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ముషారఫ్ లక్ష్యంగా వీటిని ఉంచారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ముషారఫ్ పై దేశద్రోహం నేరం కింద కేసు విచారణ ప్రారంభం కానుంది.