: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి.. కోమాలో విద్యార్థి
ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు కొనసాగుతున్నాయి. మెల్ బోర్న్ లో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడితో ఆ విద్యార్థి కోమాలోకి వెళ్లినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే, స్నేహితుడితో కలసి మన్రియాజ్విందర్ సింగ్ అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థి ఫుట్ పాత్ పై నిలబడి ఉండగా... 8 మంది దుండగులు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం వారి దగ్గరున్న సెల్ ఫోన్లను తీసుకుని పరారయ్యారు. ఈ దాడిలో సింగ్ కోమాలోకి పోగా, అతని స్నేహితుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. దాడికి పాల్పడిన వారికోసం గాలిస్తున్నారు.