: దమ్ముంటే ఆ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించండి : గోనె
వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతునిచ్చిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యముంటే ఆ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ మాజీ చైర్మెన్ గోనె ప్రకాశ్ రావు డిమాండు చేశారు. సహకార ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. అసలు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేయనేలేదన్నారు.