: జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి భవనాన్ని కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ
కడప మాజీ మేయర్, వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి చెందినదిగా భావిస్తున్న భవనాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో నిర్మాణ దశలో ఉన్న ఈ భవనాన్ని పోలీసు భద్రత మధ్య జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఈ భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని... తక్షణమే దాన్ని కూల్చివేయాలని హైకోర్టు జీహెచ్ఎంసీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే, నీరజారావు అనే మహిళ సొసైటీకి చెందిన 500 గజాల స్థలాన్ని రవీంద్రనాథ్ రెడ్డి కబ్జా చేసి, భవన నిర్మాణాన్ని చేపట్టారని కోర్టుకు వెళ్లింది. దీన్ని విచారించిన హైకోర్టు భవనాన్ని కూల్చివేయాలని ఆదేశాలిచ్చింది. ఈ కేసు గత నాలుగేళ్లుగా కోర్టులో నడుస్తుండటం గమనార్హం.