: సినీ ఫక్కీ ఛేజింగ్.. బావిలో పడిన ప్రేమ జంట
సినీఫక్కీలో జరిగిన ఛేజింగ్ లో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట బావిలో పడిపోయింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని పారిపోతున్న ఈ ప్రేమ జంటను యువతి బంధువులు వెంబడించగా, అతి వేగంతో వెళ్తున్న వీరి ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిపోయింది. దీంతో యువతి మృత్యు వాత పడగా యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు.