: అమితాబ్ నివాసం ముందు భారీ భద్రత


ముంబైలో నటుడు అమితాబచ్చన్ నివాసం ముందు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల అమితాబ్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే ఒకే వేదికను పంచుకున్నారు. రాజ్ థాకరే ముంబై నుంచి ఉత్తరాది వారిని పారదోలతామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాజ్ ను కలవడం ద్వారా అమితాబ్ ఉత్తరాది వారిని అగౌరవపరిచారని ఎస్పీ ఎమ్మెల్యే అబుఅజ్మీ అన్నారు. అలాగే బీఎస్పీ కార్యకర్తలు అమితాబ్ నివాసం ముందు ధర్నా నిర్వహించనున్నారనే సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా జుహులోని అమితాబ్ నివాసం వద్ద భద్రతను పెంచామని, పెట్రోలింగ్ ను పటిష్ఠం చేశామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News