: కిరణ్, బాబు, జగన్ లు కలిస్తే విభజన ఆపొచ్చు: టీజీ
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ లు ముగ్గురూ కలిస్తే రాష్ట్ర విభజన ఆపడం పెద్ద కష్టమైన పని కాదని మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన మాట్లాడుతూ, వీరు ముగ్గురూ ఏదో రూపంలో విభజనను వ్యతిరేకిస్తున్నందున ఆ ముగ్గురూ చేతులు కలిపి విభజనను అడ్డుకోవాలని సూచించారు. తాను ఆశావాదినని రాష్ట్ర విభజన ఏదో దశలో ఆగుతుందని ఆయన తెలిపారు. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నా, తాను కాంగ్రెస్ పార్టీలోనే చివరి వరకు కొనసాగుతానని టీజీ తెలిపారు. ఒక వేళ విభజనను ఆపలేకపోతే అప్పుడు పార్టీలో ఉండాలా? వద్దా? అనేది ఆలోచిస్తానని టీజీ స్పష్టం చేశారు.