: వీణా మాలిక్ కొత్త కాపురానికి చిక్కు
నటి వీణా మాలిక్ కొత్త కాపురానికి చిక్కొచ్చి పడింది. మాజీ ప్రియుడు, మొన్నటి వరకూ డేటింగ్ చేసిన ప్రశాంత్ ప్రతాప్ సింగ్ ఆమెపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను వీణామాలిక్ బెదిరిస్తోందని చెప్పడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వీణామాలిక్ ఇటీవలే దుబాయి వ్యాపారవేత్తను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇది తెలిసిన వెంటనే అప్పటి వరకూ ఆమెతో కలిసి ముంబైలో సహజీవనం చేసిన ప్రతాప్ సింగ్ వీణాకు కాల్ చేశాడు. మరోసారి కాల్ చేస్తే అత్యాచారం చేశావని కేసు పెడతానంటూ బెదిరించింది. అలాగే, పాత విషయాలు తన భర్తకు చెబితే కేసు పెడతానని హెచ్చరించినట్లు ప్రతాప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై వీణా వాయిస్ మరోలా ఉంది. ప్రతాప్ తన దగ్గర ఉద్యోగి అని అతడికి నెలకు 10వేల జీతం ఇచ్చేదానన్ని అంటోంది.