: ఇండియన్ ఎయిర్ లైన్స్ టిక్కెట్లు భలే చవక!
ప్రైవేటు విమానయాన సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఇండియన్ ఎయిర్ లైన్స్ టికెట్ల ధరలు భారీ తగ్గించాలని నిర్ణయించింది. ఈ వేసవిలో అద్భుతమైన ఆఫర్ ప్రకటిస్తూ, రెండు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది.
ఇండియన్ ఎయిర్ లైన్స్ తాజాగా ప్రకటించిన ధరలు ఫస్ట్ క్లాస్ ఏసీ రైళ్ల ధరలకు సమానంగా ఉన్నాయి. ఈ విమానాల్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రూ. 4012, హైదరాబాద్ నుంచి కోల్ కతాకు రూ. 3798 లుగా టికెట్ ధరలు నిర్ణయించారు.