: మోహన్ బాబు, బ్రహ్మానందంలకు హైకోర్టులో చుక్కెదురు


ప్రముఖ సినీ నటులు మోహన్ బాబు, బ్రహ్మానందంలకు హైకోర్టులో ఊరట లభించింది. పద్మశ్రీ వ్యవహారానికి సంబంధించిన కేసును హైకోర్టు ఈ రోజు విచారించింది. ఈ సందర్భంగా, దేనికైనా రెడీ సినిమా టైటిల్స్ లో పద్మశ్రీని తొలగించాలని ఉన్నత న్యాయస్థానం వీరిద్దరినీ ఆదేశించింది. అంతేకాకుండా, పద్మశ్రీని తొలగించినట్టుగా పత్రికల్లో ప్రకటించాలని సినీ నిర్మాతకు ఆదేశాలు జారీచేసింది. పద్మశ్రీని చేర్చడంపై అఫిడవిట్ దాఖలు చేయాలని బ్రహ్మానందంను ఆదేశించింది. పద్మశ్రీ బిరుదును జప్తు చేయాలా? వద్దా? అనే విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామన్న హైకోర్టు... విచారణను వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News