: విద్యుత్ పొదుపు చేయండి... కానుక అందుకోండి: కేరళ సరికొత్త పథకం


ప్రతి విషయంలోనూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే కేరళ విద్యుత్ పొదుపు విషయంలో వినూత్నంగా ముందుకెళుతోంది. గత నెలలో వాడిన కరెంటు కన్నా పది శాతం పొదుపు చేస్తే, ఆ యూనిట్లకు అయ్యే ఖర్చులో 50 శాతం వినియోగదారుడికి తిరిగి ఇవ్వనున్నారు.

అంతేగాకుండా, ఓ ఫీడర్ పరిధిలోని వినియోగదారులు ఒక వారం పాటు తక్కువ విద్యుత్ వినియోగిస్తే వారిని తర్వాతి వారం విద్యుత్ కోతల నుంచి మినహాయిస్తారు.  మనరాష్ట్రంలో నెలకొన్నట్టే కేరళలోనూ విద్యుత్ కొరత ఉన్నా వారు ప్రోత్సాహకాలతో పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించడం విశేషం. అదే, మన రాష్ట్రంలో అయితే సర్ ఛార్జీ పేరిట అధికంగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News