: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అస్వస్థత
హస్తిన ముఖ్యమంత్రిగా రెండు రోజుల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు. 102 డిగ్రీల జ్వరంతో పాటు లూజ్ మోషన్స్ తో ఆయన బాధపడుతున్నారు. మంచినీటి సరఫరాపై ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని... కానీ రాంగ్ టైమ్ లో భగవంతుడు తనకు అనారోగ్యం కలిగించాడని ఆయన ట్విట్టర్లో తెలిపారు. కేజ్రీవాల్ ను పరీక్షించిన వైద్యులు ఆయన రక్త నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.