: టాప్ టెన్ కు ఎగబాకిన పుజారా
భారీ సెంచరీలతో మోత మోగిస్తున్న యువ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్ టెన్ కు ఎగబాకాడు. పుజారా ప్రస్తుతం పదో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా, ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
తర్వాతి రెండు స్థానాల్లో ఆసీస్ కెప్టెన్ క్లార్క్, విండీస్ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ చందర్ పాల్ ఉన్నారు. ఈ టాప్ టెన్ జాబితాలో పుజారా మినహా మరే భారత బ్యాట్స్ మన్ కూ చోటు దక్కలేదు. సచిన్ 19, ధోనీ 21వ ర్యాంకుల్లో నిలిచారు.