: హైదరాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాదులోని ముషీరాబాద్ లో ఉన్న టింబర్ డిపోలో ఈ తెల్లవారు జామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. డిపోలో నిల్వ ఉంచిన కలప తగలబడుతోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో అగ్ని కీలలు పక్క భవనాలకు కూడా వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 5 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. పక్క భవనాలకు వ్యాపిస్తున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతానికి 80 శాతం మంటలను అదుపులోకి తీసుకొచ్చామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టమే జరిగిందని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.