: నటి సుచిత్రాసేన్ పరిస్థితి విషమం
ప్రముఖ బాలీవుడ్ నటి సుచిత్రాసేన్ పరిస్థితి విషమంగా మారింది. 82 ఏళ్ల సుచిత్రాసేన్ ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో కొన్ని రోజుల క్రితం సుచిత్ర కోల్ కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు ఆక్సిజన్ ను కృత్రిమంగా అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 1955లో దేవదాసు చిత్రంలో అద్భుత నటన ద్వారా ఆమె జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో నటించారు. 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించడానికి నిరాకరించారు. ప్రజలకు కనిపించడం ఇష్టం లేకే ఆమె అలా చేశారని చెబుతారు. 'సిరివెన్నెల' తెలుగు సినిమాలో నటించిన మూన్ మూన్ సేన్ ఈమె కూతురే. మూన్ మూన్ కూతుళ్ళు రైమా సేన్, రియా సేన్ కూడా కథానాయికలే!