: ధర్మాన కుమారుడి కేసులో నేడు కీలక విచారణ
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడుకి చెందిన వర్లిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ కు... శ్రీకాకుళం జిల్లా కన్నెధార కొండను అక్రమంగా కట్టబెట్టిన వైనంపై... ఈ రోజు లోకాయుక్తలో కీలక విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా వర్లిన్ రాక్ ప్రతినిధులు హైదరాబాదులో లోకాయుక్త ముందు హాజరు కానున్నారు.