: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుపై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లా, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుపై వేమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓట్ల తొలగింపును నిరసిస్తూ ఈ నెల 20న తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే నేతృత్వంలో నిర్వహించిన ఆందోళన సందర్భంగా, రెవిన్యూ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారని ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆయనపై కేసు నమోదైంది.