: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల దాడులు
రాష్ట్రంలో ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు అనంతపురంలో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 8 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. ఇక విజయవాడ జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించిన మార్నింగ్ స్టార్, కేశినేని ట్రావెల్స్ కు చెందిన 5 బస్సులను సీజ్ చేశారు.