: చర్చకు రమ్మని సవాల్ విసిరితే ఫామ్ హౌస్ లో పడుకున్నాడు: చంద్రబాబు


టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని విభజనకు సోనియాగాంధీ సిద్ధమైందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తో సోనియాకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని... అందుకే అంత అవినీతి చేసినా బయటకు వచ్చాడని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. సమైక్యవాద ముసుగులో సోనియా ఏజెంట్ గా జగన్ ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఒక అవినీతి హీరో... సమైక్య హీరోగా చెలామణి కావాలని ప్రయత్నిస్తున్నాడని జగన్ ను ఉద్దేశించి అన్నారు.

రాష్ట్ర విభజన జరగాలంటే సీమాంధ్రులతో మాట్లాడాలి... కలిసుండాలంటే తెలంగాణ వారితో మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. ఏది జరగాలన్నా ఇరు ప్రాంత ప్రజలతో కూర్చొని మాట్లాడాలని అన్నారు. విభజన జరగాలంటే ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, తెలంగాణను డెవలప్ చేసిందే తానే అని... ఆ ప్రాంతాల గురించి మాట్లాడే హక్కు తనకు మాత్రమే ఉందని చెప్పారు. చర్చకు రమ్మని కేసీఆర్ కు సవాల్ విసిరితే ఫామ్ హౌస్ లో పడుకున్నాడని ఎద్దేవా చేశాడు.

ఏ తల్లి కూడా కట్టెల పొయ్యితో వంట వండుతూ కన్నీరు పెట్టుకోకుండా... తాను దీపం పథకం ప్రారంభించానని చంద్రబాబు అన్నారు. డిపాజిట్ లేకుండా స్టవ్, సిలిండర్ ఇచ్చానని చెప్పారు. కానీ కాంగ్రెస్ దొంగలు దీపాన్ని ఆర్పేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే... ఏడాదికి 10 సిలిండర్లను ఇస్తామని, గ్యాస్ కు ఆధార్ తో లింక్ లేకుండా చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News