: చెంప పగలగొడతా.. !: విలేకరిపై మండిపడ్డ జయప్రద
చెంప పగలగొడతా..! ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాంపూర్ ఎంపీ జయప్రద నుంచి వచ్చిన ప్రతిస్పందన ఇది. 'సమాజ్ వాదీ పార్టీతో మీకున్న సంబంధం ఏమిటి?' అని ఆ విలేకరి ప్రశ్నించడంతో జయప్రదలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
'ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు మీరు?' అంటూ ఆ విలేకరిపై మండిపడింది. అనంతరం సమాజ్ వాదీ పార్టీ తనను బహిష్కరించిందని చెప్పారు. కాగా, జయప్రద అంతకుముందు యూపీలో హత్యకు గురైన డీఎస్పీ కుటుంబాన్ని పరామర్శించారు.