: అవినీతిపరులను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది: చంద్రబాబు
కాంగ్రెస్ దుష్టపాలన నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడమని ఈ రోజు ఉదయం వెంకటేశ్వరస్వామిని కోరుకున్నానని చెప్పారు. అవినీతిపరులను భూస్థాపితం చేయాలని స్వామివారిని వేడుకున్నానని తెలిపారు. ధర్మాన్ని కాపాడితే, అది మనల్ని కాపాడుతుందని అన్నారు. తనకు రాజకీయాలు నేర్పింది తిరుపతేనని చెప్పారు. తిరుపతిని వాటికన్ సిటీగా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
తాను, తన బంధువులు అందరూ కష్టపడి పనిచేస్తున్నామని... అడ్డగోలుగా అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు అన్నారు. తాము రౌడీలము కాదని... తమది రౌడీ రాజకీయం కాదని చెప్పారు. అవినీతిపరులను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. అవినీతికి ఎన్టీఆర్ పూర్తి వ్యతిరేకమని... తాను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని చంద్రబాబు చెప్పారు.