: హైదరాబాదుకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది చంద్రబాబే: ముద్దుకృష్ణమ


లక్ష కోట్లు దండుకుని జైలుకెళ్లి వచ్చిన జగన్ ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. హైదరాబాదుకి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చింది చంద్రబాబేనని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబుల వల్లే తిరుపతి అభివృద్ధి చెందిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఎర్రచందనాన్ని దోచుకుపోతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని... చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. తిరుపతిలో జరిగిన తెలుగుదేశం ప్రజా గర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News