: సోనియాకు కుంభీపాకం శిక్ష వేయాలన్న 'అపరిచితుడు' శివప్రసాద్!
తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం ప్రజా గర్జన సభలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ అపరిచితుడి (సీనీ వేషం) వేషం వేశారు. 'భలే మంచి చిచ్చుపెడితివే ఓ సోనియమ్మా' అని పాట పాడుతూ... మధ్యలో జుట్టు విరబోసుకుని అపరిచితుడిగా మారిపోయారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్న సోనియాకు కుంభీపాకం శిక్ష వేయాలని అన్నారు. దీంతో సభకు హాజరైన వారితో పాటు వేదిక మీదున్న చంద్రబాబు సహా అందరూ నవ్వుకున్నారు.