: లక్ష కోట్లు దోచుకోవడం తప్ప.. చేసిందేమీ లేదు: కోడెల


కాంగ్రెస్ నేతలు సోనియా చేతిలో కీలుబొమ్మలుగా మారడం... మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ విమర్శించారు. మరో వంద రోజుల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. తిరుపతిలో జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగించారు.

శాంతిభద్రతలు, మత సామరస్యాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీయేనని కోడెల అన్నారు. మన రాష్ట్రాన్ని అక్రమంగా, రాజకీయ లబ్ది కోసం విభజించాలనుకుంటున్నారని... దీనికి తాము ఒప్పుకోమని చెప్పారు. ఒకవేళ విభజన అనివార్యమైతే, ఇరుప్రాంత ప్రజలతో మాట్లాడిన తర్వాతే విభజించాలని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి... వేర్పాటు వాదానికి బీజం వేసింది రాజశేఖరరెడ్డేనని మండిపడ్డారు.

ఉప ఎన్నికల్లో సానుభూతితో కొన్ని సీట్లు గెలుచుకున్న వైఎస్సార్సీపీ... రానున్న ఎన్నికల్లో గల్లంతవుతుందని కోడెల ఎద్దేవా చేశారు. చిల్లర దొంగనే దూరముంచే మనం... జగన్ లాంటి పెద్ద దొంగ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోనియాతో జగన్ కుమ్మక్కయ్యారన్న విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. లక్ష కోట్లను దోచుకుని జగన్ జైలుకు వెళ్లాడే తప్ప... పదేళ్లలో సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News