: ఫరూక్ షేక్ అంత్యక్రియలు రేపు
ప్రముఖ సినీనటుడు ఫరూక్ షేక్ అంత్యక్రియలు రేపు (సోమవారం) సాయంత్రం ముంబైలో జరుగుతాయి. శుక్రవారం రాత్రి దుబాయ్ లో ఆయన గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం 4 గంటలకు ఆయన పార్థివ దేహం దుబాయ్ నుంచి ముంబై చేరుకుంటుందని... 7 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని ఫరూక్ కుటుంబ సన్నిహితుడు సతీష్ షా తెలిపారు.