: జనవరి 10 నాటికి చర్చ ముగుస్తుంది: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయనే వార్తలపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. వలసల వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆయన అన్నారు. 129 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది పోతుంటారని చెప్పారు. జనవరి 10 నాటికి శాసనసభలో టీబిల్లుపై చర్చ ముగుస్తుందని తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ రోజు నిజామాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.