: కలిస్ సెంచరీతో సౌతాఫ్రికా ఆధిక్యం
డర్బన్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 5 వికెట్ల నష్టానికి 299 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా... కలిస్ అండతో మెరుగైన స్థితిలో నిలిచింది. చివరి టెస్టు ఆడుతున్న కలిస్ మరుపురాని ఇన్నింగ్స్ తో సెంచరీ బాదాడు. 13 ఫోర్ల సహాయంతో 115 పరుగులు చేసిన కలిస్... జడేజా బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. స్టెయిన్ 44 పరుగులు, డుప్లెసిస్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసి, 53 పరుగుల ఆధిక్యత సాధించింది.