: రాంచీలో ప్రారంభమైన మోడీ సభ
జార్ఖండ్ రాజధాని రాంచీలో మోడీ విజయ సంకల్ప్ ర్యాలీ ప్రారంభమైంది. ముందుగా బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తున్నారు. వాజ్ పేయి అణుపరీక్షలు జరిపి ప్రపంచానికి భారత సత్తా చాటి చెప్పారని అన్నారు. నాడు ప్రపంచ దేశాలు భారత్ పై ఆంక్షలు విధించినా వాజ్ పేయి హయాంలో దేశాభివృద్ధి ఆగలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను అదుపు చేయడానికి తన వద్ద మంత్రదండం లేదని ప్రధాని మన్మోహన్ అంటున్నారని విమర్శించారు.