: ఆస్ట్రియా యువతిని పెళ్లాడిన విజయవాడ కుర్రాడు
విజయవాడకు చెందిన బాలరాజు, ఆస్ట్రియా యువతి ఒక్కటయ్యారు. దేశాలు వేరైనా తమ ప్రేమను సఫలం చేసుకున్నారు. జర్మనీలో ఒకే కళాశాలలో చదువుతున్న బాలరాజు, అన్నా మగ్దలీన మధ్య ప్రేమ చిగురించగా.. ఇరువైపుల పెద్దల అంగీకారంతో నిన్న విజయవాడలోని ఆర్ సీఎం చర్చిలో మనువాడారు.