: ఎన్నికల్లో తన పరిస్థితేంటో కాంగ్రెస్ ఆలోచించుకోవాలి: సబ్బం హరి


రాష్ట్ర విభజన ప్రజల కోసం కాకుండా, రాజకీయ లబ్ది కోసమే జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి ఘాటుగా వ్యాఖ్యానించారు. విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోందని... ఇంత దూకుడుగా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. నిజమైన సమైక్యవాది ఎవరో తెలియని పరిస్థితుల్లో సమైక్య ఉద్యమం నడుస్తోందని చెప్పారు. నిజమైన సమైక్యవాది ఎవరో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో ఏపీ జర్నలిస్టులు నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మరిన్ని రాష్ట్రాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోందని దుయ్యబట్టారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా యుద్ధ విమానాల్లో బిల్లును పంపిస్తామని ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్ర సమైక్యత కోసం, ప్రజల మనోభావాలను కాపాడటం కోసం, దేశంలో రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలపడం కోసమే తాము అధిష్ఠానాన్ని వ్యతిరేకించామని చెప్పారు.

  • Loading...

More Telugu News