: తెలుగు తల్లి గర్భం నుంచి సమైక్య ఉద్యమం పుట్టింది: లగడపాటి


సమైక్య ఉద్యమం పెట్టుబడిదారుల నుంచి పుట్టిందంటూ తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారని... ప్రస్తుతం కోట్లాది మంది ప్రజలు సమైక్యం కోసం ఉద్యమం చేస్తున్నారని, వీరంతా పెట్టుబడిదారులా? అని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి ప్రశ్నించారు. తెలుగు తల్లి గర్భం నుంచి సమైక్య ఉద్యమం పుట్టిందని తెలిపారు. హైదరాబాదులో ఏపీ జర్నలిస్టుల 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జరుతుగున్న అన్యాయంపై ప్రజాపోరాటం వెల్లువెత్తిందని చెప్పారు. రాజకీయ వ్యవస్థపై ఆగ్రహంతోనే సీమాంధ్ర ప్రజలు పోరాట బాట పట్టారని తెలిపారు. శాసన సభలో బిల్లుపై చర్చ జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని లగడపాటి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News