: నేడు రాంచీలో మోడీ భారీ సభ


జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ రోజు బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభలో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. సభా ప్రాంగణంలో మూడు స్టేజిలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక నుంచి మోడీ ప్రసంగిస్తారు. మరో రెండు వేదికలపై ఆ పార్టీ నేతలు ఆసీనులవుతారు. మోడీ ప్రసంగించనున్న స్టేజ్ వెనుకవైపు (బ్యాక్ డ్రాప్) పార్లమెంటు ఆకారంలో ఉంటుంది. దీంతో చూసేవారికి మోడీ పార్లమెంటు నుంచి మాట్లాడుతున్నట్టుగా ఉంటుందని బీజీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

ఈ సభా ప్రాంగణానికి మోడీ బిర్సాముండా ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో వస్తారు. ఇప్పటికే గుజరాత్ నుంచి వచ్చిన ఓ పోలీస్ టీమ్ భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. దీనికి తోడు జార్ఖండ్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News