: ఆమ్ ఆద్మీలోకి లాల్ బహదూర్ శాస్త్రి మనవడు
కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు ఆదర్శ్ శాస్త్రి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోటి రూపాయలకుపైగా వార్షిక వేతనం.. రాజాబాబు లాంటి యాపిల్ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. 'ధన్యవాదాలు.. తాతలా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తా' అంటూ ఆదర్శ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రజాధికారం ప్రజలకే బదిలీ అయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.