: తిరుమలలో వీఐపీలకు కాక సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలి: చంద్రబాబు


ఈ రోజు తాను సామాన్య భక్తుడిలానే శ్రీవారి దర్శనం చేసుకున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తిరుమలలో స్వామి వారి దర్శనానికి వీఐపీలకు కాకుండా, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దర్శనానికి సంబంధించి సామాన్యులకు ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. కొండమీద ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆలయ ఈవోకు సూచించానని తెలిపారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అవినీతి రహిత సమాజం కోసం తాను స్వామి వారిని ప్రార్థించానని తెలిపారు.

  • Loading...

More Telugu News