: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నీలేకని సిద్ధం


భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ ప్రాజెక్టు ఛైర్మన్ నందన్ నిలేకని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే తన ఆసక్తిని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి నిలేకని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ పరిశీలిస్తోంది. తన సొంత రాష్ట్రమైన కర్ణాటక నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో నిలేకని ఉన్నారు.

గత కొన్ని రోజులుగా నిలేకని రాజకీయ ఆరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటికీ కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర్ తెరదించారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిలేకని ఆసక్తి చూపుతున్నారని స్పష్టం చేశారు. దీనిపై హైకమాండ్ త్వరలోనే ఓ నిర్ణయానికి రానుందని చెప్పారు. ఇదే జరిగితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి ఐటీ దిగ్గజం నిలేకనే కానున్నారు.

  • Loading...

More Telugu News