: యాషెస్: ఆస్ట్రేలియా ఘన విజయం


ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా దూసుకుపోతోంది. మెల్ బోర్న్ లో జరిగిన నాలుగో టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను మట్టి కరిపించి... సిరీస్ లో 4-0 ఆధిక్యత సాధించింది. మ్యాచ్ నాలుగో రోజున 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్... కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయఢంకా మోగించింది.

ఓపెనర్ రోజర్స్ అద్భుత బ్యాటింగ్ పటిమతో 155 బంతుల్లో 116 పరుగులు (13 ఫోర్లు) చేశాడు. మరో ఓపెనర్ వార్నర్ 25 పరుగులకే వెనుదిరిగినప్పటికీ... అనంతరం బరిలోకి దిగిన వాట్సన్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 90 బంతుల్లో 11 ఫోర్లతో 83 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ క్లార్క్ ఆరు పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. పనేసర్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.

  • Loading...

More Telugu News