: రేపు శాసనసభలో వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం


వైఎస్సార్సీపీ రేపు శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాసంపై నోటీసులు అందజేస్తామని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వచ్చి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని వైఎస్సార్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి పేర్కొన్నారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News