: నేడు తిరుపతిలో టీడీపీ తొలి 'ప్రజాగర్జన' సభ


తెలుగుదేశం పార్టీ నిర్వహించ తలపెట్టిన 'ప్రజాగర్జన' బహిరంగ సభలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ సభను తిరుపతిలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన వ్యవహారం, దేశ, రాష్ట్ర స్థాయిలో జరిగిన కుంభకోణాలు, భవిష్యత్ రాజకీయ వైఖరి తదితర విషయాలను గురించి ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ సభల్లో వివరిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

  • Loading...

More Telugu News