: విజయం వెనుకే కాదు... డ్రెస్సింగ్ వెనుక కూడా ఉంటారట!


మనందరం ఎక్కువగా వినే ఒక మాట... ప్రతి మగవాడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుంది. ఈ విషయం ఎంత వరకూ నిజమోకానీ... మగవారికి సంబంధించిన డ్రెస్సింగ్ వెనుక ఒక మాత్రం కచ్చితంగా ఒక స్త్రీ ఉంటుందట. అంటే మగవారికి నప్పే దుస్తుల ఎంపిక విషయంలో కూడా మగువలే కీలక పాత్ర పోషిస్తారట. తమకు ఎలాంటి దుస్తులు బాగుంటాయి? అనే విషయంపై ఎక్కువమంది మగవారు మగువలపైనే ఆధారపడతారని ఒక అధ్యయనంలో తేలింది.

స్టైల్‌ పైలట్‌ అనే ఆన్‌లైన్‌ డ్రస్సింగ్‌ సలహా సంస్థ నిర్వహించిన ఒక ప్రత్యేక అధ్యయనంలో పాల్గొన్న మగవారిలో మూడింట రెండు వంతుల మంది తమ దుస్తుల ఎంపిక పనిని మగువలకే అప్పగిస్తున్నట్టు ఒప్పుకున్నారు. తాము ధరించే చొక్కా, ప్యాంటు విషయంలోనే కాదు, టై, షూల ఎంపిక విషయంలో కూడా భార్యపైన ఆధారపడతామని ఈ అధ్యయనంలో పాల్గొన్న చాలామంది మగవారు చెప్పారట.

అంతేకాదు... వారాంతపు సెలవుల తర్వాత సోమవారం నాడు ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు కూడా తమ భార్యలు ఎంపిక చేసిన దుస్తులను వేసుకుని వెళతామని చెప్పారట. దీనికి కారణం మగవారికి తమ డ్రస్సింగ్‌ పట్ల తగిన అభిరుచి, అవగాహన లేకపోవడమేనని, అందువల్ల తమ ఆహార్యం పట్ల ఆత్మస్థైర్యం కొరవడటమే కారణమని స్టైల్‌ పైలట్‌ సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News