: రైలు ప్రమాద మృతులకు 10 లక్షలు ఇవ్వాలంటూ ఖర్గేకు చంద్రబాబు లేఖ
అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం క్రింద 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2.5 లక్షల రూపాయలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ప్రమాదానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.