: అయ్యప్ప సన్నిధానానికి వెళ్లే భక్తుల కోసం టోల్ ఫ్రీ నెంబరు
శబరిమలలోని అయ్యప్ప సన్నిధానానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వి.విజయ రామారావు ఆదిలాబాద్ జిల్లా ఎదులాపురంలో ప్రకటించారు. టోల్ ఫ్రీ నెంబరు 1800-4256-656. శబరిమలకు వెళ్లే భక్తులు జనవరి 20 వరకూ ఈ నెంబరుకు ఫోన్ చేసి కావాల్సిన సమాచారం పొందవచ్చని ఆయన తెలిపారు.