: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ స్థానం పదిలం
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ద్వితీయ స్థానాన్ని కాపాడుకున్నాడు. గతేడాది ఇదే స్థానంలో ఉన్న కోహ్లీ ఈసారి కూడా రెండవ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్ కూడా తమ ఆరవ, పదవ స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఇక వన్డేల్లో భారత్ 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా 114 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది.