: ఐఆర్ ప్రకటించాల్సిన బాధ్యత సీఎందే: ఉద్యోగ సంఘాల ప్రతినిధులు
తమకు మధ్యంతర భృతి (ఐ.ఆర్) ప్రకటించాల్సిన బాధ్యత సీఎం కిరణ్ కుమార్ రెడ్డిదేనని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాదులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సీఎస్, ఆర్థిక శాఖలకు తమ సమస్యలు విన్నవించామని, అయినప్పటికీ సీఎం మధ్యంతర భృతిపై నిర్ణయాన్ని వాయిదా వేయడం బాధాకరమని అన్నారు. ధరలు మండిపోతున్నాయని, అవసరాలు కూడా పెరిగిపోతున్నాయని.. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఐఆర్ ప్రకటించకుండా తాత్సారం చేయడం సరికాదని వారు చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికే తాము మూడు పీఆర్సీలు కోల్పోయామని.. దీనిని కూడా తమకు కాకుండా చేయవద్దని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి విన్నవించారు.