: సీఎం రాజీనామా చేసి హీరో అవుదామనుకుంటున్నారు: దేవినేని ఉమా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కాంగ్రెస్ ను వీడుతారంటూ వస్తున్న వార్తలకు, కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు మరింత బలం చేకూర్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 23 తర్వాత సీఎం తన పదవికి రాజీనామా చేసి హీరో అవుదామని చూస్తున్నారన్నారు. సమైక్యతపై చిత్తశుద్ధి ఉంటే సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం, పీసీసీ చీఫ్, స్పీకర్ నాదెండ్ల రాజీనామా చేయించాలన్నారు.