: కిరణ్, బాబు, జగన్ లు ఒక్కటిగా పోరాడాలి: టీజీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ లు రాష్ట్రవిభజనను అడ్డుకునేందుకు ఏకతాటిపై పోరాడాలని మంత్రి టీజీ వెంకటేష్ కోరారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవిభజన అడ్డుకోలేకపోతే పార్టీని వీడుతామని అన్నారు. తమ పోరాటం పార్టీ అధిష్ఠానంతోనే తప్ప పార్టీతో కాదని ఆయన స్పష్టం చేశారు. విభజన ఆగిపోతే వలసలు కూడా ఆగిపోతాయని టీజీ వెల్లడించారు.